Cyclone Tauktae: బార్జ్ విషాదం.. 49 మృతదేహాల వెలికితీత

ABN , First Publish Date - 2021-05-21T02:03:15+05:30 IST

బార్జ్ ‘పి305’ మునిగిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు. తౌక్తే తుపాను కారణంగా

Cyclone Tauktae: బార్జ్ విషాదం.. 49 మృతదేహాల వెలికితీత

ముంబై: బార్జ్ ‘పి305’ మునిగిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 49 మంది మృతదేహాలను వెలికి తీశారు. తౌక్తే తుపాను కారణంగా ముంబై తీరంలోని అరేబియా సముద్రంలో ఇది మునిగిపోయింది. దుర్ఘటన సమయంలో బార్జ్‌లో 261 మంది ఉండగా, వారిలో 186 మందిని రక్షించినట్టు నేవీ అధికారులు తెలిపారు. అలాగే, టగ్‌బోట్ వరప్రద నుంచి ఇద్దరిని రక్షించినట్టు పేర్కొన్నారు. ఇంకా 37 మంది జాడ కనిపించడం లేదన్నారు. వీరిలో 26 మంది బార్జ్ పి305లోని వారు కాగా, టగ్‌బోటుకు సంబంధించి 11 మంది ఉన్నారు. 


గల్లంతైన వారి కోసం నేవీ ఈ ఉదయం నుంచి ఏరియల్ సెర్చ్ ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ముంబై తీరంలో  హెలికాప్టర్లను మోహరించింది. ఇంకా ఎవరైనా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో నౌకలు కూడా సెర్చ్ లైట్ల సాయంతో రాత్రంతా గాలించాయి. కనీసం మరో మూడు రోజులపాటు గాలింపు చర్యలు కొనసాగనున్నట్టు నేవీ కమాండర్ అజయ్ ఝా తెలిపారు.  

Updated Date - 2021-05-21T02:03:15+05:30 IST