దేశంలో కొత్తగా 45,352 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-03T16:03:50+05:30 IST
దేశంలో కొత్తగా 45,352 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 366 మంది మృతి చెందారు.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 45,352 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 366 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 3,99,778 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 34,791 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,20,63,616కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 67.09 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ జరిగింది.