34,881మంది డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2021-05-09T16:48:47+05:30 IST

రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న రీతిలోనే కోలుకునేవారి సంఖ్య క్రమేపీ పెరగడం కొంత ఊరటనిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 47,563 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 34,881మంది డిశ్చార్జ్‌ కావడం

34,881మంది డిశ్చార్జ్‌


బెంగళూరు: రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న రీతిలోనే కోలుకునేవారి సంఖ్య క్రమేపీ పెరగడం కొంత ఊరటనిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 47,563 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 34,881మంది డిశ్చార్జ్‌ కావడం గమనార్హం. బెంగళూరులో 21,534మంది, తుమకూరులో 2419, మైసూరులో 2294, బాగల్కోటెలో 1563, దక్షిణకన్నడ 1513, మండ్య 1225, ఉడుపి 1043, ఉత్తరకన్నడ 1034, హాసన్‌ 996, బెళగావి 991, బెంగళూరు గ్రా మీణ 958, ధార్వాడ 965, కోలారు 903, రాయచూరు 894మంది ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదయ్యారు. ఇప్పటివరకు 18,86,448మంది బాధితులు అయ్యారు. కాగా అత్యధికంగా బెంగళూరులో 18473 మంది కోలుకోగా ఇంతవరకు 13.19లక్షలమంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 482మంది కొవిడ్‌తో మృతి చెందగా బెంగళూరులో 285 మంది ఉన్నారు. ఇంతవరకు 18,286 మంది కొవిడ్‌తో మృత్యువాత చెం దారు. కాగా కరోనా నియంత్రణకోసం రాష్ట్రప్రభుత్వం సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనుంది. 

Updated Date - 2021-05-09T16:48:47+05:30 IST