కోవిడ్ వ్యాక్సిన్ల దొంగతనం.. షాకైన డాక్టర్లు
ABN , First Publish Date - 2021-04-14T21:03:26+05:30 IST
జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు.
జైపూర్ : జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. కరోనా వ్యాక్సిన్లను కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 320 వ్యాక్సిన్లను దొంగలించారు. దీంతో ఆస్పత్రి సూపరిండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి 320 వ్యాక్సిన్ డోసులు మిస్సయ్యాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. 320 డోసులు మిస్సయ్యాయి అని తెలుసుకొని షాక్ అయ్యాం’’ అని మెడికల్ చీఫ్ ఆఫీసర్ నరోత్తం శర్మ పేర్కొన్నారు.