26 జిల్లాల్లో తగ్గిన Covid ప్రభావం
ABN , First Publish Date - 2021-11-28T17:52:19+05:30 IST
రాష్ట్రంలోని 30 జిల్లాల్లో బెంగళూరు, ధార్వాడతోపాటు మరో రెండు జిల్లాల్లో మాత్రమే కొవిడ్ ప్రభావం కొనసాగింది. మిగిలిన 26 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 322 మందికి పాజిటివ్

బెంగళూరు: రాష్ట్రంలోని 30 జిల్లాల్లో బెంగళూరు, ధార్వాడతోపాటు మరో రెండు జిల్లాల్లో మాత్రమే కొవిడ్ ప్రభావం కొనసాగింది. మిగిలిన 26 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 322 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు 149, ధార్వాడలో 76, మైసూరులో 27, దక్షిణ కన్నడలో 13 మందికి వైరస్ సోకింది. తొమ్మిది జిలాల్లో ఒక కేసూ నమోదు కాలేదు. 17 జిల్లాల్లో పది మంది లోపు నమోదయ్యారు. 176 మంది కోలుకోగా ముగ్గురు మృతిచెందారు. 6754 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5279 మంది ఉన్నారు.