25.3 శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చి ఉండొచ్చు: ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2021-02-05T05:58:00+05:30 IST

భారతదేశంలో 10-17 మధ్య వయసు కలిగి ఉన్న వారిలో 25.3 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడి ఉండొచ్చని

25.3 శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చి ఉండొచ్చు: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: భారతదేశంలో 10-17 మధ్య వయసు కలిగి ఉన్న వారిలో 25.3 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడి ఉండొచ్చని ఐసీఎంఆర్ గురువారం వెల్లడించింది. తాము చేసిన సీరోసర్వేలో ఈ లెక్కలు బయటపడినట్టు తెలిపింది. అంతేకాకుండా 18 - 44 మధ్య వయసు వారిలో 19.9 శాతం, 45 - 60 వయసున్న వారిలో 23.4 శాతం, 60కు పైబడిన వారిలో 23.4 శాతం మందికి ఇప్పటికే కరోనా సోకి ఉండొచ్చని సర్వేలో తెలిసినట్టు చెప్పింది. గతేడాది డిసెంబర్ 17 నుంచి ఈ ఏడాది జనవరి 8 వరకు మూడోసారి సీరోసర్వేను నిర్వహించినట్టు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ తెలిపారు. 


ఈ సర్వేలో 7,171 మంది హెల్త్‌కేర్ వర్కర్లు పాల్గొన్నారని, మొత్తం 28,589 మందిపై ఈ సర్వే నిర్వహించామని బలరాం భార్గవ గురువారం మీడియాతో చెప్పారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో ఈ సర్వేను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో వంద మంది హెల్త్‌కేర్ వర్కర్లు సర్వే నిర్వహించినట్టు బలరాం భార్గవ చెప్పారు. కాగా.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 1,08,02,831 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,54,841 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2021-02-05T05:58:00+05:30 IST