240మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-05-02T14:41:32+05:30 IST

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జైళ్లలో 240 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. వారందరికీ జైళ్లలోనే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్య

240మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌బెంగళూరు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జైళ్లలో 240 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. వారందరికీ జైళ్లలోనే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వైరస్‌ ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని హోం మంత్రి బొమ్మై ఆదేశించారు. బెంగళూరు పరప్పన అగ్రహారలో వంద పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. జైలు వైద్యాధికారులు బాదితులకు చికిత్స అందిస్తున్నారు. 45ఏళ్లు పైబడిన 80శాతం ఖైదీలకు వ్యాక్సినేషన్‌ జరిపించారు. కొత్తగా జైలులో ప్రవేశించే ఖైదీలకు 14రోజుల క్వారంటైన్‌ కొనసాగిస్తున్నారు. ప్రతివారం హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-05-02T14:41:32+05:30 IST