234 కిలోల బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-14T08:03:36+05:30 IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న నగలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు

234 కిలోల బంగారం స్వాధీనం

చెన్నై, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న నగలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై నుంచి కంటైనర్‌లో తరలిస్తున్న 234 కిలోల బంగారం నగలను సేలం జిల్లా తలైవాసల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖరన్‌ నేతృత్వంలోని బృందం తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించారు. ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదని, గతంలో తీసుకున్న ఆర్డర్‌ మేరకు నగలను డెలివరీ చేయడానికి తీసుకొచ్చామని వారు వివరించారు. ఇక తిరువారూర్‌ జిల్లాలో రెండు వ్యాన్‌లలో రూ.11 కోట్ల నగదును తరలిస్తుండగా అధికారులు విచారించారు.

Updated Date - 2021-03-14T08:03:36+05:30 IST