మెక్సికోలో కూలిన మెట్రో ఓవర్‌పాస్
ABN , First Publish Date - 2021-05-05T08:23:29+05:30 IST
మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మెట్రో రైలు ఓవర్‌పాస్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 23 మంది దుర్మరణం పాలయ్యారు...

- 23 మంది దుర్మరణం.. 70 మందికి గాయాలు
మెక్సికో సిటీ, మే 4: మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మెట్రో రైలు ఓవర్‌పాస్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 23 మంది దుర్మరణం పాలయ్యా23రు. మరో 70 మందికి త్రీవ గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉం డటం మరీ విషాదం. మెక్సికో సిటీలో రద్దీగల ప్రాంతమైన ట్లాహువాక్‌లో ఆ దేశ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30కు ఈ ప్రమాదం జరిగింది.