దేశంలో కొత్తగా 22,431 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-07T16:14:31+05:30 IST

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 22,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24,602 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో కొత్తగా 22,431 కరోనా కేసులు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 22,431 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24,602 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 318 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,44,198కి చేరింది. దేశంలో మొత్తం 3,38,94,312 మంది ఇప్పటి వరకూ కరోనా బారిన పడ్డారు. కోలుకున్న వారి సంఖ్య 3,32,00,258కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 4,49,856 మంది మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 92,63,68,608కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Updated Date - 2021-10-07T16:14:31+05:30 IST