20 నుంచి చెన్నై-సూరత్‌ విమాన సేవలు

ABN , First Publish Date - 2021-07-15T15:52:08+05:30 IST

చెన్నై నుంచి గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కు విమానసేవలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో ఈ రెండు నగరాల మధ్య ఐదు విమాన సేవలు వుండగా, అవి ఢి

20 నుంచి చెన్నై-సూరత్‌ విమాన సేవలు

ఐసిఎఫ్‌(చెన్నై): చెన్నై నుంచి గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కు విమానసేవలు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో ఈ రెండు నగరాల మధ్య ఐదు విమాన సేవలు వుండగా, అవి ఢిల్లీ, హైదరాబాద్‌, కొల్‌కతాకు వెళ్లి, అక్కడి నుంచి సూరత్‌ కు అనుబంధ సేవలుగా వెళ్లేవి. ప్రస్తుతం చెన్నై- సూరత్‌ మధ్య నేరుగా ఇండిగో  విమానసేవలు ఈనెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. చెన్నై నుంచి సాయంత్రం 5 గంటలకు, సూరత్‌ నుంచి సాయంత్రం 6.10 గంటలకు విమానాలు బయల్దేరు తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-15T15:52:08+05:30 IST