2023 నాటికి కావేరీ 5వ స్టేజి పనులు పూర్తి

ABN , First Publish Date - 2021-05-02T16:25:52+05:30 IST

కావేరీ నీటి పారుదల 5వ స్టేజి పనులు చురుగ్గా సాగుతున్నాయని 2023 నాటికి ఈ పథకం పూర్తికానుందని జలమండలి పేర్కొంది. బీబీఎంపీ పరిధిలోని 110 గ్రామాలకు కావేరీ 5వ స్టేజి

2023 నాటికి కావేరీ 5వ స్టేజి పనులు పూర్తి


బెంగళూరు: కావేరీ నీటి పారుదల 5వ స్టేజి పనులు చురుగ్గా సాగుతున్నాయని 2023 నాటికి ఈ పథకం పూర్తికానుందని జలమండలి పేర్కొంది. బీబీఎంపీ పరిధిలోని 110 గ్రామాలకు కావేరీ 5వ స్టేజి తాగునీరు కల్పించడం కోసం 5,550 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2017లో జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ, బిడబ్ల్యు ఎస్‌ఎస్‌బి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2021 ఫిబ్రవరి నాటికి అన్ని ప్యాకేజ్‌ కార్యక్రమాలకు ఆపరేషన్‌ ప్రారంభం కావాల్సివుండగా మార్చిలో ప్రారంభం అయ్యాయి. అన్ని ప్యాకేజీలు 30 నెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే కేటీహళ్ళిలో 775 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం కల జలశుద్దీకరణ కేంద్రం, టీకే హళ్ళి, హారోహళ్ళి, తాతగుణి వద్ద నీటి సేకరణ కేంద్రాల నిర్మాణం, కేటీ హళ్ళి నుంచి నగరానికి సరఫరా అయ్యే కాలువ పనులు ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయిన జలమండలి పేర్కొంది. కొవిడ్‌ సందర్భంగా కూడా జలమండలి పనులను మాత్రం ఆపకుండా 2023 లోగా పనులు పూర్తిచేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-02T16:25:52+05:30 IST