యువకుడి ప్రాణం తీసిన పతంగి దారం

ABN , First Publish Date - 2021-01-13T02:21:32+05:30 IST

మహారాష్ట్రలోని జట్టరోడి ప్రాంతంలో ఇవాళ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ యువకుడి మెడకు ..

యువకుడి ప్రాణం తీసిన పతంగి దారం

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని జట్టరోడి ప్రాంతంలో ఇవాళ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఓ యువకుడి మెడకు ‘‘మాంజా’’ దారం చుట్టుకుని గొంతు తెగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని అజ్నిలోని ధ్యానేశ్వర్ నగర్‌కు చెందిన ప్రణయ్ ప్రకాశ్ థాక్రేగా గుర్తించారు. ప్రణయ్, అతడి తండ్రి వేర్వేరు బైక్‌ల మీద తెహశీల్ ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరూ జట్టారోడి స్క్వేర్ దాటుతుండగా.. ప్రణయ్ మెడకు పదునైన పతంగి దారం చుట్టుకోవడంతో కిందపడిపోయాడు. గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించామనీ.. అయితే ఆ అతడు లోపే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఇమాంబాద పోలీస్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. గాజు పొడి, ప్లాస్టిక్ దారంతో పదునైన మాంజా దారం తయారు చేస్తుండడంతో.. దేశంలోని పలుచోట్ల తరచూ వాహనదారులు, పక్షులు ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో ఈ దారం వాడకాన్ని నిషేధించారు. 

Updated Date - 2021-01-13T02:21:32+05:30 IST