మరో 2 కోవిడ్ వ్యాక్సిన్లు, కోవిడ్ పిల్‌కు కేంద్రం అనుమతి

ABN , First Publish Date - 2021-12-28T18:26:36+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు చేసే విషయంలో భారత ప్రభుత్వం మరోసారి..

మరో 2 కోవిడ్ వ్యాక్సిన్లు, కోవిడ్ పిల్‌కు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు చేసే విషయంలో భారత ప్రభుత్వం మరోసారి సత్తా చాటుకుంది. మంగళవారం ఒకేరోజు మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్లు- కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ వైరల్ డ్రగ్ 'మోల్నూపిరావిర్'లను అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ ప్రకటించారు. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 వ్యాక్సిన్ కొవావాక్స్, కార్బోవాక్స్, యాంటీ కోవిడ్ పిల్ మోల్పూపిరావిర్‌లకు సెంట్రల్ డ్రగ్ అథారిటీ సీడీఎస్‌సీఓ ఆమోదం తెలిపినట్టు ఓ ట్వీట్‌లో మంత్రి తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటి వినియోగానికి ఆమోదం లభించిందనన్నారు.


''కంగ్రాట్యులేషన్స్ ఇండియా ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. కోవిడ్‌పై పోరాటాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీడీఎస్‌సీఏ ఒకే రోజు మూడింటికి (వ్యాక్సిన్, పిల్) అనుమతించింది'' అని ఆ  ట్వీట్‌లో మాండవీయ పేర్కొన్నారు. తాజా ఆమోదంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Updated Date - 2021-12-28T18:26:36+05:30 IST