గర్ల్‌ఫ్రెండ్‌కు షాక్: ప్రియుడిపై నమ్మకంతో ఇంటి తాళాలు ఇస్తే...

ABN , First Publish Date - 2021-02-02T03:38:33+05:30 IST

గర్ల్‌ఫ్రెండ్ ఇంటిలో చోరికి పాల్పడ్డ ఓ 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 13 లక్షల రూపాయల విలువైన వస్తువులను అతడు దొంగిలించినట్టు వారు తెలిపారు.

గర్ల్‌ఫ్రెండ్‌కు షాక్: ప్రియుడిపై నమ్మకంతో ఇంటి తాళాలు ఇస్తే...

ముంబై: గర్ల్‌ఫ్రెండ్ ఇంటిలో చోరికి పాల్పడ్డ ఓ 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 13 లక్షల రూపాయల విలువైన వస్తువులను అతడు దొంగిలించినట్టు వారు తెలిపారు. ముంబైలో ఈ దారుణం జరిగింది. ప్రియుడిపై నమ్మకంతో తన ఇంటి డూప్లికేట్ తాళాలు చేతిలో పెడితే..అతడు చోరీకి దిగనట్టు పోలీసులు తెలిపారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. కొద్ది నెలల క్రితం వారిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచియమైనట్టు తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో కలుసుకునేందుకు వీలుగా యువతి తాళాలను ప్రియుడి చేతిలో పెట్టిందని చెప్పారు. ఇటీవల కుటుంబమంతా విహారయాత్రకు వెళ్లిన సందర్భాన్ని అవకాశంగా తీసుకుని చోరికి దిగాడని తెలిపారు. జనవరి 27 తిరిగొచ్చిన వారు చోరి జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. కాగా.. నిందితుడి నుంచి పోలీసులు రెండు లక్షల నగదుతో పాటూ ఓ ఐఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2021-02-02T03:38:33+05:30 IST