రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.97 కోట్ల డోసులు
ABN , First Publish Date - 2021-05-21T08:39:30+05:30 IST
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1,97,70,555 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణలో 54.53 లక్షల డోసుల వినియోగం: కేంద్రం
న్యూఢిల్లీ, మే20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1,97,70,555 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో మరో 25,98,760 డోసులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 21,07,31,130 వ్యాక్సిన్ డోసులను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 19,09,60,575 డోసులు వినియోగించుకున్నట్లు గురువారం వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం 54,53,386 వ్యాక్సిన్ డోసులను వినియోగించుకోగా, ఇందులో తొలి డోసును 43,86,757 మంది, రెండో డోసును10,66,629 మంది వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.