సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌కు రూ.186 కోట్లు

ABN , First Publish Date - 2021-05-30T18:16:53+05:30 IST

ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి (సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌)కు ఇప్పటివరకు...

సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌కు రూ.186 కోట్లు

  • రూ.41 కోట్లతో ఆక్సిజన్‌, వైద్య పరికాలు
  • స్టాలిన్‌ ప్రకటన


చెన్నై/అడయార్‌ : ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి (సీఎం పబ్లిక్‌ రిలీఫ్‌ ఫండ్‌)కు ఇప్పటివరకు 186.15 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఈ నిధులతో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్‌, ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 41.40 కోట్ల రూపాయ లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేటాయించారు. ఈ నిధులతో ఆక్సిజన్‌ తయారీ యంత్రాలతో పాటు ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేయను న్నారు. వీటిని సిప్‌కాట్‌ సంస్థ ద్వారా సింగపూర్‌ వంటి విదేశాల నుంచి ఆక్సి జన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల్లో భాగంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈపరీక్షలు గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజుకు 1.60 లక్షల పరీక్షలు చేస్తు న్నారు. దీంతో ఈ ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌లను కొనుగోలు చేసేందుకు రెండో దశలో రూ.50 కోట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశాలు జారీచేశారు. కాగా, ఆక్సిజన్‌ పరికరాలు, వైద్య సామాగ్రితో పాటు ఆర్‌టీపీసీఆర్‌ కిట్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లను కేటాయించిన విషయం తెల్సిందే.

Updated Date - 2021-05-30T18:16:53+05:30 IST