కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి చంపేసిన 17 ఏళ్ల బాలిక

ABN , First Publish Date - 2021-10-20T08:05:01+05:30 IST

తల్లిదండ్రులు తనను సరిగా చూసుకోవడం లేదని మనస్తాపానికి గురైందా బాలిక. అన్న, చెల్లిపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలను తనపై చూపడం లేదని భావించింది.

కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి చంపేసిన 17 ఏళ్ల బాలిక

చిత్రదుర్గ, అక్టోబరు 19: తల్లిదండ్రులు తనను సరిగా చూసుకోవడం లేదని మనస్తాపానికి గురైందా బాలిక. అన్న, చెల్లిపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలను తనపై చూపడం లేదని భావించింది. విచక్షణ కోల్పోయింది. ఇంట్లో భోజనంలో విషం కలిపింది. నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటకలోని లంబనిహట్టి జిల్లా ఐసముద్ర గ్రామంలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక.. తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు, నాయనమ్మతో మూడేళ్లుగా కలిసి ఉంటోంది. అంతకుముందు అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. తల్లిదండ్రులు తనపై ప్రేమ చూపడం లేదని కక్ష పెంచుకుంది. జూలై 12న రాత్రి రాగిముద్దలో పురుగుల మందు కలిపింది. దాన్ని తిన్న బాలిక నాయనమ్మ, తల్లిదండ్రులు, సోదరి చనిపోయారు. సోదరుడు చికిత్స తర్వాత కోలుకున్నాడు. బాలికే కుటుంబ సభ్యులను చంపిందని పోలీసులు తేల్చారు.

Updated Date - 2021-10-20T08:05:01+05:30 IST