కొవిడ్‌ వల్ల 174 మంది వైద్యుల మృతి: కేంద్రం

ABN , First Publish Date - 2021-02-06T07:41:19+05:30 IST

దేశంలో కొవిడ్‌-19 కారణంగా మొత్తం 174 మంది వైద్యులు, 116 మంది నర్సులు, 199 మంది ఆరోగ్య

కొవిడ్‌ వల్ల 174 మంది వైద్యుల మృతి: కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో కొవిడ్‌-19 కారణంగా మొత్తం 174 మంది వైద్యులు, 116 మంది నర్సులు, 199 మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి చెందారని శుక్రవారం కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వివరాలు తెలిపారు.


దేశంలో సమర్థంగా తీసుకున్న చర్యలవల్ల కరోనా ఉద్ధృతిని తగ్గించగలిగామని చెప్పారు. దేశంలో 15,17,506 ఐసొలేషన్‌ బెడ్లు, 79,385 ఐసీయూ బెడ్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో 1,214 ప్రభుత్వ, 1,152 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2021-02-06T07:41:19+05:30 IST