కేంద్ర బడ్జెట్‌పై 13 లక్షల ట్వీట్లు

ABN , First Publish Date - 2021-02-01T22:03:35+05:30 IST

ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం అదొకటని అంటున్నారు. అంతే కాకుండా డిజిటల్ విధానం నానాటికీ

కేంద్ర బడ్జెట్‌పై 13 లక్షల ట్వీట్లు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన అనంతరమే సోషల్ మీడియాలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి ఒక్కో కేటాయింపు గురించి ప్రకటిస్తూ ఉంటే నెటిజెన్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తూ వచ్చారు. ఈ చర్చ ఎంతలా జరిగిందంటే.. ‘బడ్జెట్ 2021’ అనే హ్యాష్‌ట్యాగ్‌పై ఇప్పటి వరకు ఏకంగా 13 లక్షల ట్వీట్లు వచ్చాయి. ట్విట్టర్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పబ్లిక్ వేదికల్లో విస్తృత చర్చ జరుగుతోంది.


ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం అదొకటని అంటున్నారు. అంతే కాకుండా డిజిటల్ విధానం నానాటికీ అభివృద్ధి చెందుతుండడం, సోషల్ మీడియా యూజర్లతో పాటు వాడకంలోనూ అనేక మార్పులు రావడంతో ఈ వేదికలపై చర్చలు పెరిగాయి. ఈ తరుణంలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు.

Updated Date - 2021-02-01T22:03:35+05:30 IST