13 జిల్లాల్లో వందలోపు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-22T17:05:04+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,867 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1034 మందికి ప్రబలింది. మిగిలిన 29 జిల్లాల్లోనూ

13 జిల్లాల్లో వందలోపు కరోనా కేసులు


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,867 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1034 మందికి ప్రబలింది. మిగిలిన 29 జిల్లాల్లోనూ 600లోపు కేసులు నమోదు కాగా 13 జిల్లాల్లో వందలోపు నమోదయ్యాయి. యాదగిరిలో అత్యల్పంగా 8 మందికి వైరస్‌ సోకింది. తాజాగా 8,404 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 142 మంది మృతిచెందగా బెంగళూరులో 28 మంది, మైసూరు 22, దక్షిణకన్నడ 14, బెళగావి 12 మంది మృతి చెందారు. మిగిలిన జిల్లాల్లో పది మందిలోపు నమోదయ్యారు. ఇంకా 1,23,124 మంది 30 జిల్లాల ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 70,312 మంది ఉన్నారు. 

Updated Date - 2021-06-22T17:05:04+05:30 IST