రూ.102 కోట్లతో ఉన్నత విద్యాశాఖకు కొత్త భవనాలు

ABN , First Publish Date - 2021-10-29T15:48:46+05:30 IST

చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్నామలై జిల్లాల్లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. గురువారం

రూ.102 కోట్లతో ఉన్నత విద్యాశాఖకు కొత్త భవనాలు

                 - ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై(Chennai): చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్నామలై జిల్లాల్లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. గురువారం ఉదయం సచివాలయంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొత్త భవనాలకు శ్రీకారం చుట్టారు. ఆ నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలు, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలు, ప్రభుత్వ సాంకేతిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వైజ్ఞానిక కేంద్రాల్లో నిర్మించిన తరగతి గదుల కొత్త భవనాలు, ప్రయోగశాల భవనాలు, హాస్టల్‌ భవనాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌, టాయ్‌లెట్లను ఆయన ప్రారంభించారు. 

Updated Date - 2021-10-29T15:48:46+05:30 IST