100 పాఠశాల భవనాల కూల్చివేత

ABN , First Publish Date - 2021-12-19T17:18:05+05:30 IST

పుదుకోట జిల్లాలో తొలిదశగా శిథిలావస్థకు చేరుకున్న 100 పాఠశాల భవనాలను కూల్చివేయాల్సిందిగా కలెక్టర్‌ కవిత రాము ఉత్తర్వులు జారీచేశారు. తిరునల్వేలిలో పాఠశాల భవనం గోడ కూ

100 పాఠశాల భవనాల కూల్చివేత

                         - పుదుకోట కలెక్టర్‌ ఉత్తర్వులు


ప్యారీస్‌(చెన్నై): పుదుకోట జిల్లాలో తొలిదశగా శిథిలావస్థకు చేరుకున్న 100 పాఠశాల భవనాలను కూల్చివేయాల్సిందిగా కలెక్టర్‌ కవిత రాము ఉత్తర్వులు జారీచేశారు. తిరునల్వేలిలో పాఠశాల భవనం గోడ కూలి ముగ్గురు విద్యార్థులను బలిగొన్న సంఘటనపై స్పందించిన కలెక్టర్‌ కవిత రాము, ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు, అధికారులను అప్రమత్తం చేస్తూ శనివారం ఓ సర్క్యులర్‌ జారీచేశారు. జిల్లాలో ఉన్న 325 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాల్లో 259 భవనాలను గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. 66 పాఠశాల భవనాలు, ఉన్నత, మహోన్నత పాఠశాలల భవనాలను ప్రజాపనుల శాఖ నిర్వహిస్తోంది. ఈ భవనాల వివరాలు సేకరించి వాటిలో శిథిలావస్థకు చేరుకున్న వాటిపై సమర్పించిన నివేదికను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రస్తుతం తొలిదశగా ఏంబల్‌ ప్రాంతంలో ఉన్న పురాతన పాఠశాల భవనం సహా 100 పాఠశాల భవనాలు కూల్చివేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు.

చెన్నైలో.... : నగరంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు అని మొత్తం 1,447 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలకు పాఠశాల విద్యా శాఖ ఈ-మెయిల్‌ ద్వారా నోటీసు జారీచేసింది. ఈ నెల 22వ తేదీలోపు పాఠశాల భవనాల పటిష్ఠత ధ్రువీకరించి, అవి ఎప్పుడు నిర్మితమయ్యాయి... అని వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు జిల్లా ప్రిన్సిపల్‌ విద్యాశాఖ అధికారి మార్క్స్‌ తెలిపారు.

Updated Date - 2021-12-19T17:18:05+05:30 IST