గంగా నదిలో తేలిన 100 కొవిడ్ మృతదేహాలు
ABN , First Publish Date - 2021-05-10T22:22:12+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కోవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు
పాట్నా: బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగా నదిలో 100 కొవిడ్ మృతదేహాలు వెలుగు చూశాయి. అయితే వీటి గురించి ఆరా తీయగా ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చాయని, తమ రాష్ట్రానికి చెందినవి కావని బక్సర్ జిల్లా అధికార యంత్రాంగం బదులు ఇచ్చింది. జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద సుమారు 100 మృతదేహాలు గంగా నది నీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చౌదాకు చెందిన బీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘మహదేవ్ ఘాట్‌కు 40 నుంచి 45 శవాల వరకు కొట్టుకువచ్చాయి. ఇవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి. కొవిడ్‌తో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉంది. దానికి ఒక కాపలా దారుడిని పెట్టి మరీ కాల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఇవి ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయి. నదిలో మృతదేహాలను అడ్డుకునే మార్గం లేనందున ఇక్కడి వరకు కొట్టుకువచ్చాయి’’ అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కొవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్తుండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నెటిజెన్లు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.