ఉల్లి పచ్చిది తినాలా? వండిందా?
ABN , First Publish Date - 2021-02-26T20:41:58+05:30 IST
ఉల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ కాంపౌండ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆంధ్రజ్యోతి(26-02-2021)
ప్రశ్న: ఉల్లి పోషక విలువలేమిటి? పచ్చి ఉల్లి తింటే మంచిదా లేక వండినది తినాలా?
- చిన్మయి, తిరుపతి
డాక్టర్ సమాధానం: ఉల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ కాంపౌండ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వంద గ్రాముల ఉల్లిపాయల్లో కేవలం నలభై కెలోరీలు మాత్రమే ఉంటాయి. ఉల్లి బరువులో ఉన్నది తొంభై శాతం నీళ్ళే. వీటిలోని ఫ్రూక్టాన్స్ అనే ఓ రకమైన పీచుపదార్థం రక్తంలో కొలెస్ర్టాల్ను కట్టడి చేస్తుంది. ఈ పీచుపదార్థం పెద్దపేగుల్లో ఉండే మంచి బాక్టీరియా అభివృద్థికి ఉపయోగపడుతుంది. పెద్ద పేగులో కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఫ్రూక్టాన్ల వల్ల్లే కొంత మందికి ఉల్లి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్య లొస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ - సి పచ్చి ఉల్లిలో అధికం. వండినప్పుడు విటమిన్ - సి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కానీ, ఫోలేట్, విటమిన్ - బి6, పొటాషియం మాత్రం పచ్చి ఉల్లిలోనూ, కూరల్లో వేసుకున్న ఉల్లిలో కూడా ఒకే విధంగా ఉంటాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)