చలికాలంలో గుండె తక్కువ పనిచేస్తుంది కాబట్టి..

ABN , First Publish Date - 2021-12-09T18:23:39+05:30 IST

చలికాలం అంటేనే చాలామందికి బద్ధకం. అయితే వేసవికాలంతో పోలిస్తే చలికాలంలో రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడకకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది. చలికాలంలో గుండె తక్కువ పని చేస్తుంది కాబట్టి మరింతగా శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరముంది.

చలికాలంలో గుండె తక్కువ పనిచేస్తుంది కాబట్టి..

ఆంధ్రజ్యోతి(09-12-2021)

చలికాలం అంటేనే చాలామందికి బద్ధకం. అయితే వేసవికాలంతో పోలిస్తే చలికాలంలో రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడకకి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది. చలికాలంలో గుండె తక్కువ పని చేస్తుంది కాబట్టి మరింతగా శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరముంది. 

వాకింగ్‌, రన్నింగ్‌కి ముందు ఖచ్చితంగా శరీరాన్ని వామప్‌ చేసుకోవాలి. 

వాకింగ్‌, రన్నింగ్‌ చలికాలంలో ఇంకో పది నిమిషాలు ఎక్కువ చేసినా పర్లేదు. దీనివల్ల గుండెలో రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. మానసికంగా వర్కవుట్‌ సెషన్‌లో ఫిట్‌గా ఉంటారు.

యోగా చేసే అలవాటుంటే మరీ మంచిది. సూర్య నమస్కారాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. దీని వల్ల శరీరానికి మంచి వర్కవుట్‌ చేసినట్లవుతుంది. సూర్యకాంతిలో అన్ని సైకిల్స్‌ పూర్తి చేయడం వల్ల శరీరానికి విటమిన్‌ డి అందుతుంది. 

ధ్యానం మరింత హాయినిస్తుంది. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ వల్ల శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటుంది.

Read more