తరచుగా చెరకురసం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2021-12-31T18:11:45+05:30 IST

తాజా చెరకురసంలో కనీసం పదిహేను శాతం చక్కెర ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది

తరచుగా చెరకురసం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(31-12-2021)

ప్రశ్న: చెరకురసంలో ఉన్న పోషక విలువలు తెలియచేయండి. అన్ని వయసుల వారూ తరచుగా తాగొచ్చా?


- మంజరి, కడప


డాక్టర్ సమాధానం: తాజా చెరకురసంలో కనీసం పదిహేను శాతం చక్కెర ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. పాలిఫెనాల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండడం వల్ల చెరకురసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వింటుంటాం. అధిక శారీరక శ్రమ చేసి కెలోరీలు అధికంగా అవసరమయ్యేవారు, క్రీడాకారులు, కాలేయానికి సంబంధించిన అనారోగ్య కారణాలతో కొవ్వు పదార్థాలు తినకూడనివారు, వీరందరూ శక్తి కోసం రోజూ చెరకు రసం తీసుకోవచ్చు. పొటాషియం కూడా చెరకురసంలో ఉంటుంది కాబట్టి రక్తపోటు ఉన్నవారు కూడా అపుడప్పుడు తాగవచ్చు. అయితే ఒక్క గ్లాసు చెరకు రసంలో నాలుగైదు స్పూన్లకు మించి చక్కెర ఉంటుంది. కాబట్టి తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చెరకురసం తీసుకుంటే బ్లడ్‌షుగర్‌ పెరుగుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-12-31T18:11:45+05:30 IST