పంచదార, తేనెతో ఇంట్లోనే ఇలా చేస్తే..
ABN , First Publish Date - 2021-11-08T18:34:28+05:30 IST
చర్మం నిగారింపు కావాలి. బ్యూటీపార్లర్లకు వెళ్లే ఆలోచన లేదు. ఇంట్లోనే పాటించాల్సిన నియమాలు ఏవైనా ఉన్నాయా? అంటే ఇదిగో ఇలా చేయండి అంటున్నారు సౌందర్యనిపుణులు.

ఆంధ్రజ్యోతి(8-11-2021)
చర్మం నిగారింపు కావాలి. బ్యూటీపార్లర్లకు వెళ్లే ఆలోచన లేదు. ఇంట్లోనే పాటించాల్సిన నియమాలు ఏవైనా ఉన్నాయా? అంటే ఇదిగో ఇలా చేయండి అంటున్నారు సౌందర్యనిపుణులు.
క్లీన్సింగ్ : ముఖాన్ని ఫేస్ వాష్‌తో లేదా ఫేస్ క్లెన్సర్‌తో కడుక్కోవాలి. గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించాలి. తరువాత మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి. చర్మరంధ్రాలు శుభ్రపడాలంటే క్లీన్సింగ్ మిల్క్‌లో దూది అద్ది ముఖంపై తుడుచుకోవాలి.
ఆవిరి : ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. స్టీమర్ లేకపోతే పాత్రలో నీళ్లు వేడి చేయడం ద్వారా కూడా ఆవిరి పట్టొచ్చు. ఆవిరి పట్టడం పూర్తయ్యాక బ్లాక్‌హెడ్స్ ఉంటే రిమూవర్‌తో తొలగించుకుని మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి.

స్క్రబ్ : మృతకణాలు తొలగిపోవాలంటే స్క్రబ్బింగ్ తప్పనసరి. ఏదైనా ఫేస్ స్క్రబ్‌తో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ముఖంపై స్క్రబ్ చేయాలి. కాసేపయ్యాక నీళ్లతో కడిగేసుకోవాలి. రెడీమేడ్ స్క్రబర్ లేకపోతే పంచదార, తేనె మిశ్రమాన్ని వాడొచ్చు.

ఫేస్‌ప్యాక్ : ఫేస్‌ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మంచి మాయిశ్చరైజింగ్ గుణాలున్న ఫేస్‌ప్యాక్ ఉపయోగిస్తే ఫలితం బాగుంటుంది. పసుపు, శనగపిండి, అలొవెరా, తేనె, ముల్తానీ మట్టి ఉన్న ఫేస్‌ప్యాక్ అయితే మంచిది. అరటిపండు, బొప్పాయి ఫేస్‌ప్యాక్‌లు కూడా మంచి ఫలితాన్నిస్తాయి.

టోనర్ : ఫేస్‌ఫ్యాక్ తరువాత ముఖాన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు పీహెచ్ బ్యాలెన్స్ కోసం టోనర్‌ను అప్లై చేయాలి. టోనర్స్ మార్కెట్లో లభిస్తాయి. ఆపిల్ సిడార్ వెనిగర్, అలొవెరా, కీరదోస, రోజ్‌వాటర్‌ను టోనర్‌కు బదులు ఉపయోగించవచ్చు.

మాయిశ్చరైజర్ : చివరగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్న వారు థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
