ఇమ్యూనిటీ దృఢంగా...

ABN , First Publish Date - 2021-05-05T16:56:08+05:30 IST

కొవిడ్‌ నుంచి రక్షణ రోగనిరోధకశక్తితో కొంతమేరకు సాధ్యమే! ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఇమ్యూనిటీ దృఢంగా లేకపోతే కొవిడ్‌ బారిన పడతాం! కాబట్టి అందుకు తోడ్పడే ఆహార నియమాలు పాటించాలి.

ఇమ్యూనిటీ దృఢంగా...

కొవిడ్‌ నుంచి రక్షణ రోగనిరోధకశక్తితో కొంతమేరకు సాధ్యమే! ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఇమ్యూనిటీ దృఢంగా లేకపోతే కొవిడ్‌ బారిన పడతాం! కాబట్టి అందుకు తోడ్పడే ఆహార నియమాలు పాటించాలి. కొన్ని ఆహారపదార్థాలు పలు రకాల సూక్ష్మక్రిముల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అవేంటంటే...


స్ట్రాబెర్రీ, బొప్పాయి, నారింజ మొదలైన విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే పళ్లు ఎక్కువగా తినాలి.

బాదం, వేరుసెనగ, పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్‌ ఇ కూడా రోగనిరోధకశక్తికి తోడ్పడుతుంది.

అవిసె గింజలు, నట్స్‌, చేపల్లో ఉండే ఒమేగా 3 యాసిడ్లు ఇమ్యూనిటీని  పెంచుతాయి.

మష్రూమ్స్‌లో బీటా గ్లూకాన్స్‌ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి వీటిని కూడా తరచుగా తింటూ ఉండాలి.


వ్యాయామం, నిద్ర

30 నిమిషాలకు తగ్గకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగనిరోఽధకశక్తి బలపడుతుంది. వ్యాయామం వల్ల యాంటీబాడీలు, తెల్లరక్తకణాలు శరీరంలో వేగంగా కదులుతూ ఉంటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ను క్షణాల్లో పసిగట్టి, సమర్థంగా పోరాడతాయి. దాంతో వ్యాధులతో ఆరోగ్యం కుంటుపడకుండా ఉంటుంది. అలాగే రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. కంటి నిండా నిద్ర ఒత్తిడిని తొలగించి, శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. Updated Date - 2021-05-05T16:56:08+05:30 IST