రాగి రొట్టె తినడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుందా? అయితే..

ABN , First Publish Date - 2021-12-31T19:35:51+05:30 IST

మీకు కేవలం రాగి రొట్టె వల్ల మాత్రమే ఈ సమస్య వస్తున్నట్టయితే రాగులు మీ శరీరానికి సరిపడక పోవచ్చు

రాగి రొట్టె తినడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుందా? అయితే..

ఆంధ్రజ్యోతి(31-12-2021)

ప్రశ్న: రాగి రొట్టె తింటే మలబద్దకం ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం తెలుపండి. 


- ప్రసాద్‌, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: మీకు కేవలం రాగి రొట్టె వల్ల మాత్రమే ఈ సమస్య వస్తున్నట్టయితే రాగులు మీ శరీరానికి సరిపడక పోవచ్చు. కొన్ని ఆహారపదార్థాలు సరిపడకపోవడం, ఎలర్జీ లాంటివి ఉన్నట్టయితే ఇలా జరిగే అవకాశం ఉంది. ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ఉన్నవారికి కూడా కొన్ని పదార్థాలు తిన్నప్పుడు ఇలా మలబద్దకం వస్తుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు రాగిరొట్టె మానేసి ప్రత్యామ్నాయంగా వేరే చిరుధాన్యాలు లేదా గోధుమపిండితో చేసిన రొట్టెలు తీసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. రోజూ ఒకటి లేదా రెండు ప్రూన్స్‌ (ఎండు ప్లమ్స్‌ లేదా ఆల్‌బుకార్‌ పండ్లు) తీసుకోవడం, ఒక కివీ పండు తినడం కూడా మీ సమస్యకు ఉపశమనాన్ని ఇస్తుంది. పీచుపదార్థం ఎక్కువగా తీసుకున్నప్పుడు దానికి తగినంత నీళ్లు తాగకపోయినా మలబద్దకం ఏర్పడుతుంది కాబట్టి, రోజూ రెండున్నర లీటర్లయినా నీళ్లు తాగాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2021-12-31T19:35:51+05:30 IST