చర్మం మిలమిల!
ABN , First Publish Date - 2021-06-02T16:51:13+05:30 IST
కొవిడ్ మూలంగా తీవ్రమైన శ్వాసకోశ రుగ్మతలు, వాటి ఫలితంగా చర్మం మీద దద్దుర్లు తలెత్తడం, చర్మం సున్నితంగా మారిపోవడం లాంటి సమస్యలు తప్పవు. ఈ ఇబ్బందులను తొలగించుకుని చర్మానికి

ఆంధ్రజ్యోతి(02-06-2021)
కొవిడ్ మూలంగా తీవ్రమైన శ్వాసకోశ రుగ్మతలు, వాటి ఫలితంగా చర్మం మీద దద్దుర్లు తలెత్తడం, చర్మం సున్నితంగా మారిపోవడం లాంటి సమస్యలు తప్పవు. ఈ ఇబ్బందులను తొలగించుకుని చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
హెర్బల్ టీ, సూప్ లేదా రోజ్మేరీతో తయారైన షేక్, స్మూదీలతో రోజును మొదలుపెట్టాలి.
తేలికగా జీర్ణమయ్యే పోషకభరిత ఆహారంతో పాటు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
యూకలిప్టస్ నూనె కలిపిన నూనెతో ఆవిరి పట్టడం, పసుపు కలిపిన పాలు తాగడం చేయాలి.
వేప ముద్ద, పసుపు కలిపి శరీరం మర్దన చేసుకుని స్నానం చేయాలి.
నిద్రలేమి వదిలించుకోవడం కోసం రాత్రి నిద్రకు ముందు పసుపు కలిపిన పాలు తాగాలి.
హైల్యురోనిక్ యాసిడ్తో తయారైన మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.
శానిటైజర్ వాడకంతో చేతులు పొడిబారితే అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన మాయిశ్చరైజర్ పూసుకోవాలి.