మానసిక ఆరోగ్యం కోసం..

ABN , First Publish Date - 2021-05-13T17:20:27+05:30 IST

కొవిడ్‌ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్‌బారిన పడినవారు భయాందోళనలు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించి,

మానసిక ఆరోగ్యం కోసం..

ఆంధ్రజ్యోతి(13-05-2021)

కొవిడ్‌ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్‌బారిన పడినవారు భయాందోళనలు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించి, మానసిక ఆరోగ్యం పొందడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటంటే... 


అదేపనిగా కరోనా వార్తలు చూడకండి. దానివల్ల ఆందోళన పెరుగుతుంది. 


మీకు ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్‌లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. 


వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి. 


తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. 


క్రమం తప్పకుండా తేలికపాటటి వ్యాయామాలు చేయండి. నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి.  


వీటన్నిటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

Read more