పులిపిర్లు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
ABN , First Publish Date - 2021-11-20T17:15:49+05:30 IST
పులిపిర్లు సాధారణమే అయినా అవి అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మెడ భాగంలో వచ్చే పులిపిర్లు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అయితే వీటిని పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ చిట్కాలు పనిచేస్తాయి.

ఆంధ్రజ్యోతి(20-11-2021)
పులిపిర్లు సాధారణమే అయినా అవి అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మెడ భాగంలో వచ్చే పులిపిర్లు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. అయితే వీటిని పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ చిట్కాలు పనిచేస్తాయి.
ఆపిల్ వెనిగర్ పులిపిర్లను మూలాలతో సహా తొలగిస్తుంది. దూది సహాయంతో రోజూ మూడుసార్లు పులిపిర్లపైన ఆపిల్ వెనిగర్‌ను అప్లై చేస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లోనే పులిపిర్లు నల్లగా మారి రాలిపోతాయి.
వెలుల్లి రెబ్బలను మెత్తగా దంచి పేస్టులా చేసి పులిపిర్లపై రాయాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే పులిపిర్లు పోతాయి.
దూది సహాయంతో పులిపిర్లు ఉన్న చోట నిమ్మరసం అద్దినా ఫలితం కనిపిస్తుంది.
బంగాళదుంప తొక్కలతో స్క్రబ్ చేయాలి. బంగాళదుంపను జ్యూస్‌లా చేసి పడుకునే ముందు పులిపిర్లపై రాసుకున్నా ఫలితం కనిపిస్తుంది.
కొద్దిగా ఆముదం నూనె తీసుకుని అందులో బేకింగ్ సోడా కలిపి పేస్టులా తయారుచేసి రాసుకున్నా మార్పు స్పష్టంగా చూడొచ్చు.