బ్లాక్‌హెడ్స్‌ ఇంట్లోనే సులభంగా దూరం చేసుకోవచ్చు.. ఏం చేయాలంటే...

ABN , First Publish Date - 2021-11-11T18:26:15+05:30 IST

ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. బ్లాక్‌హెడ్స్‌

బ్లాక్‌హెడ్స్‌ ఇంట్లోనే సులభంగా దూరం చేసుకోవచ్చు.. ఏం చేయాలంటే...

ఆంధ్రజ్యోతి(11-11-2021)

ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ముక్కు, బుగ్గలపై ఏర్పడుతుంటాయి. చర్మరంధ్రాలు తెరుచుకుని ఉన్నప్పుడు దుమ్ము చేరి ఈ బ్లాక్‌ హెడ్స్‌ తయారవుతుంటాయి. అయితే వీటిని ఇంట్లోనే సులభంగా దూరం చేసుకోవచ్చు. ఏం చేయాలంటే...


కావలసినవి: అరటిపండు ఒకటి, ఓట్స్‌ రెండు టేబుల్‌స్పూన్లు, తేనె ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ ఇలా: ముందుగా ఓట్స్‌ను మెత్తగా దంచి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. 


తరువాత అందులో తేనె, అరటిపండు గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి.


ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. నెమ్మదిగా వేళ్లతో స్క్రబ్‌ చేయాలి. 


పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 


చివరగా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్‌ సమస్య ఇట్టే దూరమవుతుంది.


ఓట్స్‌ మృతకణాలను తొలగించడంతో పాటు చర్మరంధ్రాల్లో ఉన్న దుమ్మును తొలగిస్తాయి. అంతేకాకుండా చర్మంలో ఉన్న అదనపు నూనెను ఓట్స్‌ గ్రహిస్తాయి. తేనె మాయిశ్చరైజింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీమైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి. ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి ఇది పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుంది.

Updated Date - 2021-11-11T18:26:15+05:30 IST