సజ్జ జావతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

ABN , First Publish Date - 2021-10-28T17:32:58+05:30 IST

మనకు అందుబాటులో ఉన్న తృణధాన్యాలలో సజ్జలకు ఒక ప్రత్యేక స్థానముంది. దీనిలో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో ఎంతో ఉపకరిస్తాయి. అలాంటి సజ్జలతో రుచికరమైన జావను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

సజ్జ జావతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

ఆంధ్రజ్యోతి(28-10-2021)

మనకు అందుబాటులో ఉన్న తృణధాన్యాలలో సజ్జలకు ఒక ప్రత్యేక స్థానముంది. దీనిలో ఉండే పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో ఎంతో ఉపకరిస్తాయి. అలాంటి సజ్జలతో రుచికరమైన జావను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు: అరకప్పు సజ్జ పిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, ఒక పావు కప్పు బెల్లం, ఒక చిటికెడు వాము, ఒక పావు అంగుళం అల్లం(తురుముకోవాలి), నాలుగు కప్పుల నీళ్లు.


జావ కాచే విధానం: ముందు ఒక మూకుడులో నెయ్యిని తీసుకొని వేడి చేయాలి. దీనిలో సజ్జపిండి, వాము, అల్లం తురుము వేసి దోరగా వేయించాలి. ఎక్కువ సేపు మూకుడులో ఉంటే సజ్జపిండి మాడిపోయే అవకాశముంది. అందువల్ల దోరగా వేగిన వెంటనే దానిలో నీళ్లు, బెల్లం పొడి వేసి పదినిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా కాచిన సజ్జ జావ త్రాగటానికి చాలా రుచిగా ఉంటుంది. 


ప్రయోజనాలెన్నో..

సజ్జ పిండిలో మేగ్నిషియం, పోటాషియం విరివిగా ఉంటాయి. సజ్జలను ఎక్కువగా తింటే- శరీరంలో రక్తప్రసారం మెరుగుపడుతుంది. బీపీ కూడా తగ్గుతుంది. 

వాము మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాకుండా ఇది బ్లడ్‌ సుగర్‌ను నియంత్రిస్తుంది. మన శరీరంలో ప్రవేశించే బ్యాక్టీరియా, పరాన్నజీవులపై పోరాడుతుంది. 

బెల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాను తొలగిపోవటానికి ఉపయోగపడుతుంది. 

Updated Date - 2021-10-28T17:32:58+05:30 IST