నెయ్యి తింటే బరువు పెరుగుతారా? అసలు నిజమేంటి..!

ABN , First Publish Date - 2021-12-21T19:04:04+05:30 IST

కొన్ని అపోహలతో ఆరోగ్యకరమైన కమ్మని నెయ్యికి దూరమవుతున్నాం. నెయ్యి చుట్టూ అలుముకుని ఉన్న ఆ అపోహలు, వాస్తవాలు ఇవే!

నెయ్యి తింటే బరువు పెరుగుతారా? అసలు నిజమేంటి..!

ఆంధ్రజ్యోతి(21-12-2021)

కొన్ని అపోహలతో ఆరోగ్యకరమైన కమ్మని నెయ్యికి దూరమవుతున్నాం. నెయ్యి చుట్టూ అలుముకుని ఉన్న ఆ అపోహలు, వాస్తవాలు ఇవే!


అపోహ: నెయ్యి తింటే బరువు పెరుగుతాం


వాస్తవం: నెయ్యిలోని లినోలిక్‌ యాసిడ్‌ అధిక బరువును తగ్గిస్తుంది. పేగులను బలపరచడంతో పాటు, రక్తనాళాల గోడల్లో అడ్డంకులు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. కాబట్టి దృఢంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం పరిమితంగా నెయ్యిని తీసుకోవడం అవసరం. 


అపోహ: నెయ్యి గుండెకు చేటు చేస్తుంది


వాస్తవం: నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వును కరిగించే ఎ, ఇ, డి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా నియంత్రిస్తాయి. 


అపోహ: లాక్టోస్‌ ఇంటాలరెన్స్‌ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు


వాస్తవం: పాలు సరిపడని ల్యాక్టోజ్‌ ఇంటాలరెన్స్‌ ఉన్నవాళ్లు కూడా నెయ్యుని నిక్షేపంగా తినవచ్చు. 


అపోహ: వంటకు నెయ్యి వాడకూడదు


వాస్తవం: మిగతా నూనెల్లా స్మోకింగ్‌ పాయింట్‌కు చేరుకున్నప్పుడు ఫ్రీ ర్యాడికల్స్‌గా విడిపోయే ప్రమాదం నెయ్యిలో ఉండదు. కాబట్టి వంటలకు నెయ్యిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.


అపోహ: నెయ్యి తేలికగా అరగదు 


వాస్తవం: నెయ్యిలో సహజసిద్ధ బుటైరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. పేగుల కదలికలను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాబట్టి నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగై, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.


Read more