హ్యాపీ హ్యీపీగా ఉండాలంటే..
ABN , First Publish Date - 2021-12-21T19:52:43+05:30 IST
మనసు ఉల్లాసంగా ఉరకలేయాలంటే ఫీల్ గుడ్ హార్మోన్ ‘డోపడైన్’ మెరుగ్గా ఉండాలి. ఈ హార్మోన్ సరిపడా ఉత్పత్తి కావాలంటే, అందుకు తోడ్పడే అలవాట్లు అలవరుచుకోవాలి. అవేంటంటే...

ఆంధ్రజ్యోతి(21-12-2021)
మనసు ఉల్లాసంగా ఉరకలేయాలంటే ఫీల్ గుడ్ హార్మోన్ ‘డోపడైన్’ మెరుగ్గా ఉండాలి. ఈ హార్మోన్ సరిపడా ఉత్పత్తి కావాలంటే, అందుకు తోడ్పడే అలవాట్లు అలవరుచుకోవాలి. అవేంటంటే...
లక్ష్యం దిశగా: ఎంచుకున్న లక్ష్యానికి దినచర్యలో చోటు కల్పించాలి. అది చదువు కావచ్చు, వ్యాయామం కావచ్చు.
ఉల్లాసం: ఉల్లాసవంతమైన పనుల్లో పాల్గొనాలి. డాన్స్ చేయడం, ఆటలాడడం, నచ్చిన పాటలు వినడం... ఏ పనితో ఉల్లాసం దక్కితే, ఆ పని కోసం సమయం కేటాయించాలి.
నిద్ర: రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్ర పోవాలి. నిద్రలేమి డోపమైన్ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. దాంతో నిస్సత్తువ, మానసిక కుంగుబాటు వేధిస్తాయి.
నవ్వు: మనసారా నవ్వడం అలవాటు చేసుకోవాలి. మనసు తేలికపరిచే సంభాషణల్లో మునగాలి.
మెదడు వ్యాయామాలు: పజిల్స్, చిక్కుప్రశ్నలతో మెదడుకు వ్యాయామం అందించాలి. మెదడు చురుకుదనం పెంచడం ద్వారా కూడా డోపమైన్ ఉత్పత్తిని పెంచవచ్చు.