చేతులు మృదువుగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2021-03-03T20:53:57+05:30 IST

ఒక పాత్రలో పంచదార, ఆముదం వేసి బాగా కలిపి, తరువాత కొన్ని నిమ్మరసం చుక్కలు వేయాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతుల్లోని మృతకణాలు పోయి చేతులు మృదువుగా మారతాయి.

చేతులు మృదువుగా ఉండాలంటే..!

 ఆంధ్రజ్యోతి(03-03-2021)

ఒక పాత్రలో పంచదార, ఆముదం వేసి బాగా కలిపి, తరువాత కొన్ని నిమ్మరసం చుక్కలు వేయాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతుల్లోని మృతకణాలు పోయి చేతులు మృదువుగా మారతాయి.

అరచేతిలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, పంచదార వేసుకుని బాగా రుద్దుకోవాలి. ఆలివ్‌ నూనెలో తేమగుణాలు బాగా ఉంటాయి. పంచదార మంచి స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. దీంతో చేతులు మృదువుగా తయారవుతాయి.

రోజుకు రెండుసార్లు చేతులకు వెన్న రుద్దుకుంటే కూడా చేతులు మృదువుగా తయారవుతాయి.

వేడి చేసిన పాలు, గ్జిజరిన్‌ రెండిటినీ కలిపి మిశ్రమంలా తయారుచేసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు వేసి దాంతో అరగంటసేపు చేతులను బాగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే చేతులు ఎంతో మృదువుగా అవుతాయి. 

ఒక గిన్నెలో గుడ్డు, బాదం పొడి, తేనె వేసి బాగా  కలిపి ఆ మిశ్రమాన్ని అరచేతులకు రాసుకుని పది నిమిషాలు మసాజ్‌ చేయాలి. అలా రోజూ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

టొమాటో ముక్కలతో అరచేతులను రుద్దుకుంటే చేతులు మృదువుగా అవుతాయి. టొమాటా రసం, నిమ్మరసం, గ్లిజరిన్‌ మిశ్రమాన్ని అరచేతులకు రాసుకున్నా కూడా చేతులు మృదువుగా అవుతాయి. 

Read more