పాదాల నొప్పుల నుంచి ఉపశమనం కలగాలంటే..
ABN , First Publish Date - 2021-12-31T17:49:15+05:30 IST
కొందరికి ఉదయాన్నే లేచి కాలు కింద పెట్టిన వెంటనే పాదాలలో నొప్పి ప్రారంభమవుతుంది. ఇది రోజంతా వెంటాడుతూనే

ఆంధ్రజ్యోతి(31-12-2021)
కొందరికి ఉదయాన్నే లేచి కాలు కింద పెట్టిన వెంటనే పాదాలలో నొప్పి ప్రారంభమవుతుంది. ఇది రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. సాధారణంగా మన ఒంట్లో ఉండే నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతాయి. కానీ పాదాల్లోని ఈ నొప్పులు మాత్రం- ఉదయాన్నే లేచిన వెంటనే ప్రారంభమవుతాయి. ఈ నొప్పులు తరచూ వస్తూ ఉంటే డాక్టర్‌కు తప్పనిసరిగా చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటే తాత్కాలిక ఉపశమనం కోసం వైద్య నిపుణులు ఈ కింది చిట్కాలను సూచిస్తున్నారు.
పాదాలను పైకి పెట్టి కూర్చోవటానికి ప్రయత్నించాలి. దీని వల్ల శరీరపు బరువు పాదాలపై పడదు. నొప్పి కొద్దిగా తగ్గుతుంది.
రోజుకు రెండు సార్లు వెచ్చని నీటిలో పాదాలను ఒక పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఐస్‌ను ఒక టవల్లో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది.
ఇంటా బయట కూడా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కాళ్ల నొప్పులు ఉన్నవారి కోసం కొన్ని ప్రత్యేకమైన చెప్పులు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
వీలైనంత వరకూ హైహీల్స్‌ను వేసుకోవద్దు.
కాలి కండరాలను బలోపేతం చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలకు సంబంధించిన పూర్తి సమాచారం యూట్యూబ్ వీడియోలలో లభ్యమవుతాయి. వాటిని చూసి రోజూ కాసేపు ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి.