చర్మానికి తగిన ప్యాక్‌తో..

ABN , First Publish Date - 2021-05-12T17:50:24+05:30 IST

ఫేస్‌ప్యాక్‌ ఏదైనా ఫరవాలేదు సరిపోతుంది అనుకుంటే పొరపాటే. మీది ఎలాంటి చర్మమో తెలుసుకుని దానికి నప్పే ప్యాక్‌ను ఉపయోగించినప్పుడే ఫలితం ఉంటుంది.

చర్మానికి తగిన ప్యాక్‌తో..

ఆంధ్రజ్యోతి(12-05-2021)

ఫేస్‌ప్యాక్‌ ఏదైనా ఫరవాలేదు సరిపోతుంది అనుకుంటే పొరపాటే. మీది ఎలాంటి చర్మమో తెలుసుకుని దానికి నప్పే ప్యాక్‌ను ఉపయోగించినప్పుడే ఫలితం ఉంటుంది.


సాధారణచర్మం అయితే ఆపిల్‌ ప్యాక్‌ వాడొచ్చు. ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తరువాత గుజ్జు మాదిరిగా చేసుకోవాలి. దీనికి తేనె కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిదానంగా మసాజ్‌ చేస్తున్నట్టుగా ముఖంపై అప్లై చేయాలి. అరగంట తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆపిల్‌లో విటమిన్‌ ఎ, బి, సి ఉంటాయి. ఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ లభిస్తుంది. ఇవన్నీ సాధారణ చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి.

మొటిమలు బాధిస్తున్నట్లయితే ఆరెంజ్‌ ప్యాక్‌ వాడాలి. ఒక ఆరెంజ్‌, ఒక టీస్పూన్‌ పుదీనా, కొంచెం లెమన్‌ జ్యూస్‌ కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్‌లో విటమిన్‌ ‘సి’ పుష్కలం,. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి.

చర్మం డల్‌గా ఉంటే స్ట్రాబెర్రీలను ఉపయోగించి ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. అరకప్పు స్ట్రాబెర్రీల గుజ్జు, పావు కప్పు కార్న్‌స్టార్చ్‌ను పేస్ట్‌ మాదిరిగా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలసిపోయినట్లుగా ఉన్న చర్మానికి, డల్‌స్కిన్‌కు ఇది బాగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలో సాలిక్లిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

Updated Date - 2021-05-12T17:50:24+05:30 IST