ద్రాక్షతో చర్మసౌందర్యం!

ABN , First Publish Date - 2021-02-25T18:27:27+05:30 IST

చర్మసౌందర్యానికి పైపై మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటు కల్పించాలి. ఇందుకు ద్రాక్ష తోడ్పడుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది.

ద్రాక్షతో చర్మసౌందర్యం!

ఆంధ్రజ్యోతి(25-02-2021)

చర్మసౌందర్యానికి పైపై మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటు కల్పించాలి. ఇందుకు ద్రాక్ష తోడ్పడుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. 

వేసవి వేడిమిని తట్టుకుని సన్‌బర్న్‌ నుంచి చర్మానికి రక్షణ ఇవ్వడంలో ద్రాక్ష తోడ్పడుతుందని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీలో ఇటీవల ఓ వ్యాసం ప్రచురితమైంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి స్కిన్‌ డ్యామేజీని అడ్డుకునే పాలీఫినాల్స్‌ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉన్నాయనీ, కాబట్టి వేసవిలో ద్రాక్షను తినడం ఎంతో అవసరమనీ తాజా అధ్యయనంలో తేలింది. 

అంతే కాదు. చర్మపు పైపూతగా పూసుకునే సన్‌స్ర్కీన్‌ లోషన్లతో పాటు ద్రాక్ష రసాన్ని కూడా చర్మానికి పట్టిస్తే, ఎండ నుంచి అదనపు రక్షణ దక్కుతుందని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి చర్మం తళుకులీనేందుకు వేసవిలో ద్రాక్షకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

Read more