చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలిస్తే..?

ABN , First Publish Date - 2021-11-09T18:52:54+05:30 IST

యవ్వనంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రయత్నాలన్నీ ఉపయోగకరమైనవేనా? పెరిగే వయసును సహజసిద్ధంగా నెమ్మదించేలా చేసే ఈ మార్గాలను అనుసరించి చూడండి.

చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలిస్తే..?

ఆంధ్రజ్యోతి(09-11-2021)

యవ్వనంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రయత్నాలన్నీ ఉపయోగకరమైనవేనా? పెరిగే వయసును సహజసిద్ధంగా నెమ్మదించేలా చేసే ఈ మార్గాలను అనుసరించి చూడండి.


చర్మం సాగిపోవడం, ముడతలు పైబడే వయసుకు సూచనలే కాదు, శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌, ఒత్తిడి, పోషకాహార లోపాలకు సంకేతాలు కూడా! కాబట్టి ఖరీదైన సౌందర్య చికిత్సలకు బదులుగా సహజసిద్ధంగా వయసును నెమ్మదించేలా చేసే ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అవేంటంటే...


చక్కెర చేటు: మితిమీరిన చక్కెర సహజసిద్ధమైన కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌ల ఉత్పత్తి తగ్గేలా చేస్తుంది. దాంతో చర్మం బిగుతు సడలి, సాగుతుంది. కాబట్టి తీపి సాధ్యమైనంత తగ్గించుకోవాలి.


గ్లూటెన్‌: గోధుమలు, ఇతర స్టార్చ్‌ ఉత్పత్తులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా చర్మం బిగువుకు తోడ్పడే కీలకమైన పోషకాల శోషణ క్లిష్టమవుతుంది. కాబట్టి బ్రెడ్‌, పాస్తాలను తాజా కూరగాయలతో భర్తీ చేయాలి.


నీళ్లు: డీహైడ్రేషన్‌ చర్మం మీద ముడతలు ఏర్పడేలా చేస్తుంది. చర్మం సాగే గుణాన్ని సంతరించుకుని, మెరస్తూ ఉండాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి.


ఒత్తిడి: ఒత్తిడికి లోనయినప్పడు కార్టిసాల్‌ విడుదలవుతుంది. ఈ హార్మోన్‌ చర్మపు మెరుపుకు తోడ్పడే విలువైన ఖనిజ లవణాల శోషణకు అడ్డుపడుతుంది. ధ్యానం, యోగా, నడకతో ఒత్తిడిని వదిలించుకోవాలి.


యాంటీఆక్సిడెంట్లు: చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడానికి కారణం ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ. ఇందుకు కారణమయ్యే బోలెడన్ని టాక్సిన్లకు ప్రతి రోజూ గురవుతూ ఉంటాం. కాబట్టి శరీరానికి సరిపడా యాంటీ ఆక్సిడెంట్లను తాజా పళ్లు, కూరగాయల ద్వారా అందిస్తే, ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజీ నష్టం తగ్గుతుంది

Updated Date - 2021-11-09T18:52:54+05:30 IST