ఉప్పు ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2021-12-23T18:34:01+05:30 IST

చలికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. చలి పెరుగుతున్నప్పుడు కొందరికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఈ నొప్పుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం..

ఉప్పు ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందో తెలుసా?

ఆంధ్రజ్యోతి(23-12-2021)

చలికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. చలి పెరుగుతున్నప్పుడు కొందరికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఈ నొప్పుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం..


చలికాలంలో కీళ్ల నొప్పులు పెరగటానికి కారణాలేమిటో కచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే దీనికి సంబంధించిన రకరకాల సిద్ధాంతాలను వైద్య నిపుణులు ప్రతిపాదించారు. చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్‌ చేయటానికి రక్తప్రసరణలో కొన్ని మార్పులు వస్తాయని.. దీని వల్ల కొన్ని కండరాలు, కీళ్ల వద్ద రక్తప్రసారం తగ్గుతుందని.. దీని వల్ల ఆ ప్రాంతాల్లో నొప్పులు పెరుగుతాయనేది ఒక సిద్ధాంతం. శరీరంలోని కీళ్ల వద్ద ఉండే జిగురులాంటి పదార్థం చలి కాలంలో గట్టిపడుతుందని.. దీని వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్పి పెరుగుతుందనేది మరో సిద్ధాంతం. శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్‌ డి తక్కువగా అందడం వల్ల కూడా నొప్పులు పెరుగుతాయని కొందరు వైద్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు. ఈ నొప్పుల నుంచి తప్పించుకోవటానికి వారు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వాటిలో కొన్ని.. 


శరీరానికి చలి తగలకుండా పూర్తిగా బట్టలు వేసుకోవాలి. దీని వల్ల కీళ్లకు చలిగాలులు తగిలి నొప్పులు పెరగవు. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీరంలో రక్తప్రసారం సరిగ్గా జరుగుతుంది. కీళ్ల నొప్పుల వంటివి తగ్గే అవకాశముంటుంది. 

చలికాలం ఎక్కువ మంది వ్యాయామం చేయరు. దీని వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగటం వల్ల కీళ్ల నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి. అందువల్ల కీళ్ల నొప్పులు ఉన్నవారు శీతాకాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగాలి. తగినన్ని నీళ్లు తాగకపోవటం వల్ల కూడా నొప్పులు పెరుగుతాయి. 

చలికాలంలో చిప్స్‌ వంటి జంక్‌ఫుడ్‌ను తినకపోవటం మంచిది. సాధారణంగా ఇలాంటి జంక్‌ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉప్పు తినటం వల్ల కూడా కీళ్ల నొప్పులు పెరుగుతాయి. 

ప్రతి రోజూ వేడి నీళ్ల స్నానం చేయటం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. 

Updated Date - 2021-12-23T18:34:01+05:30 IST