రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల..?

ABN , First Publish Date - 2021-11-13T18:34:32+05:30 IST

ఈ మధ్యకాలంలో మధుమేహం అతి సామాన్యమైన జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. ఒక సారి దీని బారిన పడిన వారు మందులను వాడుతూనే ఉండాలి. అయితే ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటే

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల..?

ఆంధ్రజ్యోతి(13-11-2021)

ఈ మధ్యకాలంలో మధుమేహం అతి సామాన్యమైన జీవనశైలి వ్యాధిగా మారిపోయింది. ఒక సారి దీని బారిన పడిన వారు మందులను వాడుతూనే ఉండాలి. అయితే ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటే- శక్తిమంతమైన మందుల వాడకం తగ్గించవచ్చు. దీనికి ఆయుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం మధుమేహం (టైప్‌1) వాతదోషం వల్ల వస్తుంది. టైప్‌ 2 మధుమేహం కఫ దోషం వల్ల వస్తుంది. ఈ వాత, కఫలను నియంత్రించగలిగితే మధుమేహ తీవ్రత కూడా తగ్గుతుంది. దీని కోసం ఆయుర్వేదంలో సూచించిన సూత్రాలేమిటో చూద్దాం..


మనం తినే ఆహారపదార్థాలలో.. త్రాగే వాటిలో పసుపును ఎక్కువగా చేరిస్తే మంచిది. దీని వల్ల కఫ దోషం తగ్గుతుంది. పసుపుతో పాటుగా ఆవాలు, ఇంగువ, కొత్తిమీర మొదలైనవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. కరివేపాకు పొడిని ప్రతి రోజూ అన్నంలో వేసుకొని తినటం వల్ల మధుమేహ విలువలు తగ్గుతాయి. 


ఆయుర్వేద సూత్రాల ప్రకారం రాగి పాత్రలలో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల కఫ, వాత, పిత్త దోషాల మధ్య సమతౌల్యం ఏర్పడుతుంది. ఒక రాగి పాత్రలో నీళ్లను రాత్రంతా నిల్వ ఉంచి మర్నాడు తాగటం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. 


ప్రతి రోజూ ఆహారంలో మెంతులను ఏదో ఒక విధంగా తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఉదయాన్నే లేచి మెంతి మొలకలను తినటం లేదా మెంతి గింజలను నానపెట్టిన నీళ్లను తాగటం వల్ల మధుమేహ విలువలు తగ్గుతాయి. 


ఏ మాత్రం తీపి లేని కాకరకాయ, ఉసిరికాయ, అలోవిరా వంటివి తినటం వల్ల కూడా మధుమేహా రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. నేరేడు ఆకులు తిన్నా.. నేరేడు పళ్లు తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది.

Read more