వాక్సిన్ వేళ... ఎలాంటి డైట్?
ABN , First Publish Date - 2021-05-21T18:17:21+05:30 IST
వాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మసాలా పదార్థాలు మానేసి, తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది

ఆంధ్రజ్యోతి(21-05-2021)
ప్రశ్న: కోవిడ్ వాక్సిన్ తీసుకున్నప్పుడు ఏవైనా ప్రత్యేకమైన ఆహారపు నియమాలు పాటించాలా?
- వెంకటరమణ, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: వాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి స్వల్పంగా జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో మసాలా పదార్థాలు మానేసి, తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది. తగినన్ని నీళ్లు తాగడం చాలా ముఖ్యం. దీంతో పాటు సూప్స్, నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లు, హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ మొదలైనవన్నీ తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుచ్చ, బొప్పాయి, జామ లాంటి పండ్లు, ప్రొటీన్ కోసం తేలికగా ఉండే పప్పు, గింజలు, ముడిధాన్యాలతో చేసిన కిచిడి, రొట్టెలు తీసుకొంటే నీరసం రాకుండా ఉంటుంది. వేయించిన ఆహారం, తీపి పదార్ధాలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం మంచిది. కేవలం వాక్సిన్ తీసుకున్న రెండు, మూడు రోజులు మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుంటుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)