రక్తపరీక్షలో వచ్చిన ఫలితాలు ఏం సూచిస్తాయో తెలుసా?
ABN , First Publish Date - 2021-12-21T19:23:47+05:30 IST
రుగ్మతలను కనిపెట్టే సులువైన పరీక్ష బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షల ఫలితాల్లో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో దాగిన అస్వస్థతలకు అద్దం పడతాయి. ఆ ఫలితాల సూచనలు ఏవంటే....
ఆంధ్రజ్యోతి(21-12-2021)
రుగ్మతలను కనిపెట్టే సులువైన పరీక్ష బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షల ఫలితాల్లో కనిపించే హెచ్చుతగ్గులు శరీరంలో దాగిన అస్వస్థతలకు అద్దం పడతాయి. ఆ ఫలితాల సూచనలు ఏవంటే....
టోటల్ ప్రొటీన్ (టిపి)
పెరిగితే: డీహైడ్రేషన్, ఇన్ఫ్లమేషన్
తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్
ఎఎల్బి (ఆల్బ్యుమిన్)
పెరిగితే: డీహైడ్రేషన్
తరిగితే: రక్తస్రావం, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, జీర్ణకోశ వ్యాధి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్
బ్లడ్ యూరియా నైట్రోజన్ (బియుఎన్)
పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, మూత్ర విసర్జనలో అడ్డంకి, గుండెజబ్బు, షాక్, అధిక మాంసకృత్తులతో కూడిన ఆహారం
తరిగితే: కాలేయ వ్యాధి, ఆహారంలో మాంసకృత్తుల లోపం
గ్లోబ్యులిన్ (జిఎల్ఒబి)
పెరిగితే: తీవ్ర ఇన్ఫ్లమేషన్, తీవ్ర ఇన్ఫెక్షన్
తరిగితే: రక్తస్రావం, జీర్ణకోశ వ్యాధి, వ్యాధినిరోధకశక్తి లోపం
క్రియాటినిన్ (సిఆర్ఈటి)
పెరిగితే: మూత్రపిండాల వ్యాధి, డీహైడ్రేషన్, కండర నష్టం, మూత్రంలో అడ్డంకి
తరిగితే: ఓవర్ హైడ్రేషన్
గ్లూకోజ్ (జిఎల్యు)
పెరిగితే: డయాబెటిస్ మెల్లిటస్
తరిగితే: సెప్సిస్, పోషకాహార లోపం, నాడీ సంబంధ వ్యాధి
కొలెస్ట్రాల్ (సిహెచ్ఔల్)
పెరిగితే: డయాబెటిస్ మెల్లిటస్, హైపోథైరాయిడిజం, పాంక్రియటైటిస్, మూత్రపిండాల వ్యాధి
తరిగితే: పేగుల వ్యాధులు, కాలేయ పనితీరు లోపం.