బ్యూటీ ఫేస్‌ప్యాక్ ఇంట్లోనే ఇలా...!

ABN , First Publish Date - 2021-05-03T21:09:38+05:30 IST

పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే ఇంట్లోనే ఫేషియల్‌ అయిపోతుంది. పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు. పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే ఇంట్లోనే ఫేషియల్‌ అయిపోతుంది. పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు.

బ్యూటీ ఫేస్‌ప్యాక్ ఇంట్లోనే ఇలా...!

పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే ఇంట్లోనే ఫేషియల్‌ అయిపోతుంది.   పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా ట్రై చేయవచ్చు. 

ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో చర్మం నిగారింపు కోల్పోకుండా ఉంటుంది. 

సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్‌లా వేయాలి. పదినిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను చేతులకు కూడా వేసుకోవచ్చు.

జుట్టు సంరక్షణ కోసం ముందుగా కొద్ది వేడినూనెతో తలపై మర్దన  చేయాలి. తరువాత టవల్‌ చుట్టి పావుగంట పాటు వదిలేయాలి. తరువాత షాంపూతో స్నానం చేయాలి. కండిషనర్‌ ఉపయోగించాలి. Read more