చొరబాట్ల నుంచి బెంగాల్‌కు విముక్తి: అమిత్‌షా
ABN , First Publish Date - 2021-03-21T20:04:52+05:30 IST
భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అధికారం ఇస్తే ఐదేళ్లలో చొరబాటుదారుల నుంచి..

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అధికారం ఇస్తే ఐదేళ్లలో చొరబాటుదారుల నుంచి పశ్చిమబెంగాల్‌కు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ చేసిన తప్పిదాలకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. బెంగాల్‌లోని ఈగ్రాలో ఆదివారం జరిగిన జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ, మా, మాటి, మనుష్ అంటూ నినాదం ఇచ్చిన దీదీ ఏమైనా మార్పు తీసుకురాగలిగారా? చొరబాటుదారుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో మేము ఆ పని చేసి చూపిస్తామని, రాష్ట్రంలో చొరబాట్లకు తావులేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలను 130 మందిని టీఎంసీ గూండాలు పొట్టనపెట్టుకున్నారని, వాళ్లను విడిచిపెడతామని టీఎంసీ అనుకోవద్దని అన్నారు. మే 2న తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అమిత్‌షా చెప్పారు. అమిత్‌షా తన పర్యటనలో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు పశ్చిమబెంగాల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.