ఆ నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నారో తెలుసా...

ABN , First Publish Date - 2021-03-22T16:53:36+05:30 IST

రాష్ట్రంలో అత్యధికంగా కరూర్‌ నియోజకవర్గంలో 84 మంది అభ్యర్థులు బరిలోకి దిగడంతో ఎన్నికల అధికారులు తలలు

ఆ నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నారో తెలుసా...

చెన్నై: రాష్ట్రంలో అత్యధికంగా కరూర్‌ నియోజకవర్గంలో 84 మంది అభ్యర్థులు బరిలోకి దిగడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాలెట్‌ పేపరు స్థానంలో ప్రస్తుతం ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థ్ధుల పేర్లు, చిహ్నాలతో పాటు నోటా చోటుచేసుకుంటుంది. అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థ్ధులు బరిలో ఉంటే రెండు ఈవీఎంలు, 64 మంది ఉంటే నాలుగు ఈవీఎంలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం కరూర్‌ నియోజకవర్గంలో 90 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేయగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 84 మంది బరిలో నిలిచారు. ఈ విషయమై ఎన్నికల అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎం అత్యాధునిక పరిజ్ఞానంతో కూడుకొనిఉన్నాయని, అభ్యర్థులు ఎక్కువ మంది వుంటే ఒక పోలింగ్‌ కేంద్రంలో నాలుగు ఈవీఎంలు మాత్రమే వినియోగించాలనే నిబంధన లేదని, అభ్యర్థులు ఎక్కువైతే 24 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. 200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారి తెలిపారు.

Updated Date - 2021-03-22T16:53:36+05:30 IST