‘దీదీ, ఓ దీదీ’ అంటూ మమతను అభినందించిన శివసేన నేత

ABN , First Publish Date - 2021-05-02T21:04:27+05:30 IST

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం

‘దీదీ, ఓ దీదీ’ అంటూ మమతను అభినందించిన శివసేన నేత

ముంబై : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న టీఎంసీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీని ‘బెంగాల్ పులి’గా అభివర్ణిస్తూ ప్రశంసిస్తున్నారు. 


శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ, మమత బెనర్జీని బెంగాల్ పులిగా అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పదే పదే మాట్లాడిన మాటలు ‘‘దీదీ, ఓ దీదీ’’ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో తదుపరి ప్రభుత్వం మమత బెనర్జీ నేతృత్వంలోనే ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ కేసుల మీద అందరి దృష్టి ఉందని, రాజకీయాలపై లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఎంసీకి శివసేన మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.


పశ్చిమ బెంగాల్‌లో 294 నియోజకవర్గాల్లో 202 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో కనిపిస్తోంది. బీజేపీ 77 స్థానాల్లో ముందంజలో ఉంది. 


Updated Date - 2021-05-02T21:04:27+05:30 IST